IT, JOBS & CAREER GUIDANCE

IT, JOBS & CAREER GUIDANCE
కుటుంభం లో ఒకరికి ఉద్యోగం కల్పించగలిగితే ఆ కుటుంభానికి ఎంతో భరోసాని ఇచ్చిన వాళ్ళం అవుతాము..

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలని చదివించటానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు ఎంతో కష్టపడి చదివి పాస్ అవుతున్నారు.. కాని ఉద్యోగ ప్రయత్నాలో పూర్తిగా విఫలం అవుతున్నారు..

కారణం..

బయట పోటి ప్రపంచం లో మన కంటే అన్నింటిలో ముందుండే తోటి వారు.. 1 జాబ్ కి 100 మంది లో వచ్చే పొటిదారులు.. ఏ విధంగా ఈ పోటి లో నిలబడాలో తెలియని భయంతో ఎంతో మంది నిరుద్యోగులు గా ఉండిపోతున్నారు.. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు.. ఎవరిని సహాయం అడగాలో తోచక తల్లిదండ్రుల ఎదురుచూపులకి సమాధానం చెప్పలేక నిస్సహాయం గా ఉండిపోయే మన యువతకి మార్గదర్శం గా నిలిచింది మన కాప్స్ రాక్స్ ఐ.టి విభాగం..

"మిషన్ 1000" అని ప్రారంభించి ప్రతి శని ఆదివారాలలో ఐటి లొ ప్రావిణ్యం పొందిన మన కాప్స్ రాక్స్ కుటుంభ సబ్యులు మన యువత కొసం ట్రైనింగ్స్ ఇస్తూ ప్రస్తుత పోటి ప్రపంచం లొ పోటి దారులును ఏవిధంగా తట్టుకోవాలి అంటూ.. రెజ్యుం వ్రైటింగ్ నుండి మాక్ ఇంటర్యుల వరకు తగిన తర్పీదు ఇచ్చి మన వారు ఉంటే రిఫరెన్స్లు ఇచ్చి జాబ్ వచ్చే వరకు కృషి చేయటం ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం..

కాప్స్ రాక్స్ ఈ ఐ.టి విభాగం ఎంతో పటిష్ఠమైనది....

31-12-2019 నాటికి సుమారు 5000+ మందికి ఉద్యోగాలు మంచి కంపెనీలలో మన కాప్స్ రాక్స్ ద్వారా వచ్చాయి..

31-12-2019 నాటికి సుమారు 700+ మందికి ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు పొందారు..

ఐ.టి మరియు నాన్ ఐ.టి కి కలిపి సుమారు 50 వాట్సాప్ జాబ్ హంటర్స్ గ్రుప్ లు ఏర్పాటు చేయటం జరిగింది..

ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరియు కర్నాటకా లొ కేరీర్ గైడెన్స్, మరియు స్కిల్ డేవలప్మెంట్ పోగ్రాంలు నిర్వహిస్తున్నాము.

అంతే కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ప్రతేకంగా ఆ రోజు జాబ్ ఫెయిర్ నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇప్పించటం జరుగుతుంది....